అఖిల్ అక్కినేని "ఏజెంట్" సినిమాతో సినీరంగ ప్రవేశం చేస్తుంది కొత్తమ్మాయి సాక్షి వైద్య. ఈ మూవీ ఇంకా విడుదల కాకముందే సాక్షి అద్దిరిపోయే ఆఫర్ ను కొట్టేసిందని సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.
అదేమంటే, బోయపాటి - రామ్ పోతినేని కాంబోలో పాన్ ఇండియా మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. పూజా కార్యక్రమాలలో ఎప్పుడో లాంచ్ ఐన ఈ మూవీ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చెయ్యనుంది. పాన్ ఇండియా మూవీ కాబట్టి రామ్ సరసన అంతటి క్రేజ్ ఉన్న హీరోయిన్ ఫిక్స్ చెయ్యాలని బోయపాటి రష్మిక మండన్నా , పూజా హెగ్డే, కియారా అద్వానీ, అనన్యా పాండే తదితర క్రేజీ హీరోయిన్లను పరిశీలించి, ఆఖరికి సాక్షి వైద్యను ఫిక్స్ చేశారట. ఆమె ఆడిషన్స్ బోయపాటికి బాగా నచ్చడంతో సెకండ్ థాట్ లేకుండా సాక్షిని ఓకే చేసేశారంట. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతుంది.
ఇష్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రామ్ కు తిరిగి ఆ రేంజు హిట్ ఈ మధ్యకాలంలో రాలేదు. అటువైపు బోయపాటి బాలయ్యతో అఖండ సినిమా తీసి ఫుల్ సక్సెస్ జోష్ లో ఉన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో అని అభిమానులు కుతూహలంగా ఎదురుచూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa