ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటిటిలోకి వచ్చేస్తున్న యంగ్ మెగాహీరో లేటెస్ట్ మూవీ

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 27, 2022, 12:07 PM

యంగ్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ కెరీర్లో నటించిన మూడవ సినిమా "రంగరంగ వైభవంగా". సెప్టెంబర్ 2వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో అలరించలేకపోయింది. దీంతో ఆలస్యం చెయ్యకుండా మేకర్స్ వెంటనే డిజిటల్ ఎంట్రీ పై శ్రద్ధ పెట్టారు.
వైష్ణవ్ తేజ్, కేతికాశర్మ జంటగా నటించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అక్టోబర్ 2 నుండి ప్రముఖ ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అవుతుందట. ఈ విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందట.
గిరీశాయ ఈ మూవీని డైరెక్ట్ చెయ్యగా, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై BVSN ప్రసాద్ ఈ సినిమాను నిర్మించగా, బాపినీడు సమర్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa