మెగా హీరో వైష్ణవ్ తేజ్-కేతిక శర్మ జంటగా నటించిన "రంగ రంగ వైభవంగా" సెప్టెంబర్‌లో 2 న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్ళను సాధించలేదు. ఈ చిత్రం అక్టోబర్ 2 న నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ ప్రీమియర్ కోసం సిద్ధమవుతోంది. థియేటర్‌లలో సినిమాను మిస్ అయిన వారు వచ్చే నెల నుండి నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, సుబ్బరాజు, నరేష్, ప్రభు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మరి డిజిటల్ ప్రీమియర్‌గా ఈ చిత్రానికి ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa