చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన 'కార్తికేయ-2' బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. నిఖిల్, అనుపమ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 5న ఓటీటీలో రిలీజ్ కానుంది. జీ5 లో తెలుగు, హిందీ, తమిళ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందించగా, టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు.