త్రివిక్రమ్ - సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో "SSMB" తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే రామోజీ ఫిలింసిటీ మరియు అన్నపూర్ణ స్టూడియోలలో ఇంటెన్స్ యాక్షన్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.
ఆపై దసరా ముగిసిన తరవాత SSMB 28 సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఆ షెడ్యూల్ లో SSMB 28 లీడింగ్ లేడీ పూజా హెగ్డే కూడా పాల్గొనబోతున్నారు. పూజాతో పాటు మరో హీరోయిన్ కూడా ఈ సినిమాలో నటించబోతుందని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే కదా. సెకండ్ హీరోయిన్ రోల్ లో యంగ్ బ్యూటీ శ్రీ లీల, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ... నటిస్తున్నారని టాక్ నడిచినా... ఈ గోల్డెన్ ఆపర్చునిటీ మాత్రం "చిట్టి" చేతికి చిక్కింది. చిట్టి అంటే... జాతిరత్నాలు లో హీరోయిన్ గా నటించిన ఫారియా అబ్దుల్లా. ఈ పొడుగుకాళ్ల సుందరి మహేష్ ఛార్మ్ అండ్ స్టైల్ కు పర్ఫెక్ట్ సూటబుల్ మ్యాచ్ అని మేకర్స్ ఆమెకే ఓటు వేసారంట. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడనుంది.
![]() |
![]() |