మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ హీరో శ్రీనాథ్ భాసీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మూవీ ప్రమోషన్‌లో తనతో అభ్యంగా ప్రవర్తించారని మహిళా యాంకర్ ఆయనపై పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేసింది. ఇంటర్వ్యూ మధ్యలో తనపై దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు ఆయనను అరెస్ట్ చేయగా, కాసేపటికే ఆయన విడుదలయ్యారు. ట్రాన్స్, భీష్మపర్వం, కప్పెలా వంటి హిట్ చిత్రాలలో శ్రీనాథ్ నటించారు.