నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార ఇటీవల విడుదలై ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొత్త దర్శకుడు వశిష్ట తెరకెక్కించిన ఈ సోసియో ఫాంటసీ యాక్షన్ డ్రామాలో క్యాథెరిన్ ట్రెస్సా, సంయుక్తా మీనన్ హీరోయిన్స్ గా నటించగా, శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. చిరంతన్ భట్, ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు.
లేటెస్ట్ గా బింబిసార డిజిటల్ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. ప్రముఖ ఓటిటి జీ 5లో అక్టోబర్ ఏడవ తేదీ నుండి బింబిసార డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతుందని టాక్. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన రాబోతుందట.
బింబిసార తో పాటే విడుదలైన కార్తికేయ2 ఆల్రెడీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేసుకుని దసరా కానుకగా, అక్టోబర్ ఐదవ తేదీన జీ 5 ఓటిటి లోనే స్ట్రీమింగ్ కాబోతుంది.