మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా "గాడ్ ఫాదర్". కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక అతిధి పాత్రలో నటిస్తున్నారు.
దసరా కానుకగా అక్టోబర్ ఐదవ తేదీన తెలుగు, హిందీ, మలయాళం భాషలలో విడుదల కాబోతున్న ఈ మూవీ యొక్క ట్రైలర్ రేపు బుధవారం విడుదల కాబోతుందని టాక్. ఈ విషయమై మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట.
లేడీ సూపర్ స్టార్ నయనతార, యంగ్ హీరో సత్యదేవ్, సునీల్, పూరి జగన్నాధ్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ తో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.