మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 154 వ చిత్రం "మెగా 154" (వర్కింగ్ టైటిల్). కేఎస్ రవీంద్ర (బాబీ) డైరెక్షన్లో ఔటండౌట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో మాస్ రాజా రవితేజ కీలకపాత్రను పోషిస్తున్నారు.
షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాపై ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే, మెగా 154 పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ రిలీజ్ రైట్స్ ను ప్రఖ్యాత ఓటిటి నెట్ ఫ్లిక్స్ యాభై కోట్లకు కొనుగోలు చేసిందట. విశేషమేంటంటే, గాడ్ ఫాదర్ పోస్ట్ థియేట్రికల్ రైట్స్ ను కూడా నెట్ ఫ్లిక్స్ సంస్థే సుమారు 57కోట్లు పెట్టి దక్కించుకుంది. చూస్తుంటే, మెగాస్టార్ ను నెట్ ఫ్లిక్స్ ఇప్పుడప్పుడే వదిలేటట్టు కన్పించట్లేదుగా.
పోతే, అక్టోబర్ ఐదవ తేదీన తెలుగు, హిందీ, మలయాళ భాషలలో విడుదల కాబోతున్న గాడ్ ఫాదర్ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.