రంజిత్, సౌమ్య మీనన్ జంటగా నటిస్తున్న చిత్రం "లెహరాయి". ఈ సినిమాతో రామకృష్ణ పరమహంస టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి అప్సరస అనే మెలోడీ లిరికల్ విడుదలైంది. ఘంటాడి కృష్ణ స్వరపరిచిన ఈ బ్యూటిఫుల్ మెలోడీని రేవంత్ ఆలపించగా, శ్రీమణి సాహిత్యం అందించారు. అజయ్ సాయి డాన్స్ కంపోజ్ చేసారు.
SLS బ్యానర్ పై మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమాను బెక్కం వేణుగోపాల్ సమర్పిస్తున్నారు. సీనియర్ నటులు రావు రమేష్, నరేష్, ఆలీ కీలకపాత్రలు పోషిస్తున్నారు.