నందమూరి బాలకృష్ణ గారు హోస్ట్ చేసిన "అన్ స్టాపబుల్ విత్ NBK" సీజన్ 2 కోసం ప్రేక్షకాభిమానులు ఎప్పటి నుండో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
అల్లు అరవింద్ గారి "ఆహా" ఓటిటిలో బాలయ్య హోస్ట్ చేసిన అన్ స్టాపబుల్ టాక్ షో కు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ టాక్ షో థీమ్ వీడియో సాంగ్ విడుదలైంది. ఇందులో బాలయ్య స్టైల్, మాస్ స్వాగ్ అద్దరకొడుతున్నాయి. నందమూరి నటసింహం బాలకృష్ణ గారు హోస్ట్ చేసిన ఈ షో అత్యధిక వ్యూలు సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. బాలయ్యబాబు వాక్చాతుర్యం, షోకు విచ్చేసిన ప్రముఖ సెలెబ్రిటీల క్రేజ్ కారణంగా ఈ షో అత్యధిక వ్యూయర్ షిప్ సాధించి, IMDB రేటింగ్స్ లో స్థానం సంపాదించుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa