ఇండియన్ విజువల్ వండర్ 2.0 మూవీ రివ్యూ
నటీనటులు : రజినీకాంత్ ,అక్షయ్ కుమార్ ,అమీ జాక్సన్ తదితరులు
సంగీతం : ఏఅర్ రెహ్మాన్సి
నిమాటోగ్రఫర్ : నిరవ్ షా
ఎడిటింగ్ : ఆంటోనీ
దర్శకత్వం : యస్ శంకర్ని
ర్మాత : సుభాష్ కరణ్బ్యా
నర్ – లైకా ప్రొడక్షన్
విడుదల తేది – 29.11.2018
కథ: తమిళనాడు దగ్గర ఓ ప్రాంతంలో ముసలి వ్యక్తి బాధపడుతూ వచ్చి సెల్‌ఫోన్ టవర్‌కు ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. పక్క రోజు నుండి సెల్‌ఫోన్స్ మాయమవుతూ ఉంటాయి. ఎవరి దగ్గరా సెల్‌ఫోన్సే ఉండవు అన్నీ మాయమవుతూ ఉంటాయి. విషయం అర్థం కాక సెంట్రల్ హోం మినిష్టర్ సైంటిస్ట్ వశీకరణ్(రజనీకాంత్)ని కలుస్తాడు. వశీకరణ్, తన హ్యుమనాయిడ్ లేడీ రోబోట్ వెన్నెల(ఎమీజాక్సన్)తో కలిసి సెల్‌ఫోన్స్ ఏమయ్యాయనే దానిపై ఆరా తీస్తూ పోతే ఓ నెగటివ్ ఎనర్జీ వశీకరణ్‌పై దాడి చేస్తుంది. అలాంటి నెగటివ్ ఎనర్జీని తట్టుకోవాలంటే సూపర్ పవర్ కావాలని అందుకోసం చిట్టిని మళ్లీ యాక్టివేట్ చేస్తానని అంటాడు వశీకరణ్. కానీ హోం మినిష్టర్ ఒప్పుకోడు. ఈలోపు పెద్ద సెల్‌ఫోన్ షాప్ యజమాని, సెల్‌ఫోన్ సర్వీస్ ప్రొవైడర్, టెక్నాలజీ మినిష్టర్ అంతు చిక్కకుండా చనిపోతారు. చివరరకు హోం మినిష్టర్ ఒప్పుకోవడంతో చిట్టి రంగంలోకి దిగి అసలు ఆ నెగటివ్ ఎనర్జీని ఎదుర్కొంటాడు. చివరకు ఆ నెగటివ్ ఎనర్జీ ప్రొఫెసర్ పక్షిరాజు(అక్షయ్‌కుమార్) అని తెలుస్తుంది. అసలు పక్షి రాజు ఎవరు? అతనికి నెగటివ్ ఎనర్జీ ఎందుకు వచ్చింది? సెల్‌ఫోన్స్‌కు, పక్షిరాజుకు ఉన్న సంబంధం ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
సాంకేతికత పెరుగుతున్న కొద్ది మనుషుల్లో అజాగ్రత్త పెరిగిపోతుంది. ముఖ్యంగా వాతావరణం గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. మనిషికి టెక్నాలజీ ఎంతో అవసరం. అయితే అది మనిషికున్న కనీస అవసరాలను తీర్చేది.. వారి బాధలను తొలగించేదిగా ఉండాలి. అలాగే ఈ భూప్రపంచం కేవలం మనుషులది మాత్రమే కాదు.. చాలా జీవిరాశులున్నాయి. వాటికి కూడా జీవించే పరిస్థితులను మనమే కల్పించాలనే అంశాన్ని దర్శకుడు ఓ కథగా రాసుకున్నాడు. అయితే కథలో పెద్దగా ట్విస్టులేం లేవు. ఓ వ్యక్తి తను ఓ మంచి కోసం పాటు పడితే ఆ మంచి జరగకపోగా వాతావరణానికి నష్టం కలుగుతుంటే అతనేం చేశాడనేదే. అయితే దీనికి సాంకేతికతను జోడించి డైరెక్టర్ శంకర్ ఎక్కడా బోర్ కొట్టించకుండా తెరకెక్కించాడు. రజనీకాంత్ నాలుగు షేడ్స్.. వశీకరణ్.. చిట్టి, వెర్షన్ 2.0(బ్యాడ్ చిట్టి)..తో పాటు యూనిట్ దాచిన సీక్రెట్ ఏంటంటే వెర్షన్ 3.0లోని మరుగుజ్జు చిట్టి వెర్షన్ 3.0 పాత్రల్లో రజనీకాంత్ చక్కగా నటించాడు.
ఫస్టాఫ్ అంతా వశీకరణ్, వెన్నెలగా నటించిన ఎమీజాక్సన్, చిట్టిరోబో... చుట్టూనే తిరుగుతుంది. సెంకడాఫ్‌లో బ్యాడ్ చిట్టి అవసరం ఉండంతో 2.0 వెర్షన్‌ను రీలోడ్ చేయడం.. అది పక్షిరాజుతో చేసే పోరాటంతో సాగుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా బావుంది. గ్రాపిక్స్ సినిమాలో కీ రోల్ పోషించాయి. ఓ రకంగా టెక్నికల్ విజువల్ వండర్‌గా సినిమా మెప్పిస్తుందనండంలో సందేహం లేదు. రెహమాన్, రసూల్ పూకుట్టి బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత బలాన్నివ్వగా.. నిరవ్‌షా మరింత అద్భుతంగా సినిమాను తెరకెక్కించాడు. ఆర్ట్ వర్క్ బావుంది. ముఖ్యంగా ల్యాబ్ సెట్ బావుంది.
అక్షయ్‌కుమార్ ఎన్‌త్రాలజీ ప్రొఫెసర్‌గా.. చివరకు నెగటివ్ ఎనర్జీ ఉన్న పక్షిరాజుగా మెప్పించాడు. ముఖ్యంగా ఈసినిమాలో రజనీకాంత్ కంటే అక్షయ్‌కుమార్‌కే ఎక్కువ కష్టం ఉంది. ఎందుకంటే అతను వేసుకున్న మేకప్ ఆసాధారణంగా ఉంటుంది. లేడీ హ్యమనాయిడ్ రోబోట్‌గా ఎమీజాక్సన్ పాత్ర పరిధి మేర బావుంది. ఈ పాత్ర అక్కడక్కడా చెప్పే సీరియల్, సినిమా డైలాగ్స్ కాస్త ఎంటర్‌టైనింగ్ వేలో ఉంటాయి. యాక్షన్ పార్ట్ బావుంది. కొత్త కథేం కాకపోయినా.. అసలు ఓ మనిషి ఓరా నెగటివ్ ఎనర్జీగా ఎలా మారుతుందనే అంశాన్ని శంకర్ లాజికల్‌గా చక్కగా తెరకెక్కించాడు. ఆ పవర్‌ను న్యూట్రలైజ్ చేయడం.. చివరకు అది తప్పించుకుని బయటకు రాగానే.. చిట్టి వెర్షన్ 2.0 దాంతో స్టేడియంలో చేసే ఫైట్ అంతా బావుంది. ఇలాంటి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శంకర్ అభినందనీయుడు అయితే.. 550 కోట్లు ఖర్చు పెట్టి సినిమాను నిర్మించిన నిర్మాతలను అభినందించాల్సిందే.
మూవీ రివ్యూ : 3/5
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa