బాలీవుడ్ గ్లామర్ బ్యూటీలలో ఒకరు పరిణితి చోప్రా. ఆమె లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం "కోడ్ నేమ్ తిరంగా". సింగర్ హార్డీ సందు ఈ సినిమాతో నటుడిగా పరిచయం కాబోతున్నారు.
లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ విడుదలయ్యింది. 2001 పార్లమెంట్ ని అటాక్ చేసిన ముఖ్యసూత్రధారిని పట్టుకోవడానికి భారత ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటుంది. అతను టర్కీ లో ఉన్నాడని తెలియడంతో హీరోయిన్ దుర్గ సింగ్ ను అక్కడికి పంపిస్తారు. మరి, దుర్గ తన మిషన్ ను కంప్లీట్ చేసిందా..? హీరోతో లవ్ ట్రాక్ సంగతేంటి? అన్న విషయాలు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే. మొత్తంగా ట్రైలర్ లో హాట్ బ్యూటీ కాస్తా గన్ పట్టుకుని, భారీ యాక్షన్ స్టంట్స్ చేస్తూ, పర్ఫెక్ట్ వార్ గర్ల్ గా మారిపోయింది.
పోతే, ఈ మూవీని రిభు దాస్ గుప్తా డైరెక్ట్ చేసారు. అక్టోబర్ 14వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది.