బాలీవుడ్ జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం "విక్రంవేద". హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ కలిసి నటిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 30వ తేదీన గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.
పోతే, ఈ మూవీ 2017లో విడుదలైన తమిళ్ బ్లాక్ బస్టర్ "విక్రంవేద" కు అఫీషియల్ హిందీ రీమేక్. తమిళంలో ఈ సినిమాను డైరెక్ట్ చేసిన పుష్కర్, గాయత్రిలే హిందీలో కూడా డైరెక్ట్ చేస్తున్నారు.
ఇంటరెస్టింగ్ విషయమేంటంటే, నిజానికి తెలుగులో కూడా విక్రంవేద మూవీ మూడేళ్ళ క్రితమే రావలసి ఉంది కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. ఇప్పుడు హిందీలో ఈ మూవీ భారీ ఎత్తున రిలీజ్ కాబోతుండడంతో, ఆ రిజల్ట్ ను బట్టి, తెలుగులో ఒక మెగా హీరో రీమేక్ చేద్దామని ఆలోచిస్తున్నారట. ఐతే, ఆ మెగా హీరో ఎవరన్నది ఇంకా బయటకు రాలేదు.