'బిచ్చగాడు' ఫేమ్ విజయ్ ఆంథోనీ నుండి రాబోతున్న మరొక విభిన్న చిత్రం "హత్య". గతంలో నీటి బుడగే అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదలవగా, లేటెస్ట్ గా నీకు జ్ఞాపకం అనే సెకండ్ సాంగ్ విడుదలైంది. ఐతే, ఈ పాట పూర్తి వీడియో రూపంలో రిలీజ్ అయ్యింది. ఈ పాటను అంజనా రాజగోపాలన్ ఆలపించగా, భాష్య శ్రీ సాహిత్యం అందించారు.
ఈ సినిమాకు గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతం అందించారు. బాలాజీ కుమార్ డైరెక్షన్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీలో రితికా సింగ్, మీనాక్షి చౌదరి, రాధికా శరత్ కుమార్, మురళి శర్మ, సిద్ధార్ధ్ శంకర్, కిషోర్ కుమార్, జాన్ విజయ్ కీలకపాత్రలు పోషించారు. ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్, లోటస్ పిక్చర్స్ సంయుక్త బ్యానర్లు నిర్మించారు.