ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డేవిడ్ వార్నర్ భార్య వివాదం.. లైవ్ షోలో ఆస్ట్రేలియా మాజీ స్టార్ ఆగ్రహం

sports |  Suryaa Desk  | Published : Wed, Mar 04, 2026, 10:20 PM

ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాల్లో తాజాగా ఓ పాడ్‌కాస్ట్ వివాదం సంచలనంగా మారింది. మాజీ లెగ్ స్పిన్నర్ స్టువర్ట్ మెక్‌గిల్, స్పోర్ట్స్ జర్నలిస్ట్, పాడ్‌కాస్ట్ హోస్ట్ హోస్ట్ ఆండ్రే మెన్జెల్‌తో లైవ్ షోలో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటన అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ వివాదం క్రికెట్ అన్‌ఫిల్టర్ పాడ్‌కాస్ట్‌లో చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా 2018 దక్షిణాఫ్రికా టూర్‌పై చర్చ జరుగుతుండగా, అప్పట్లో డేవిడ్ వార్నర్ భార్యపై జరిగిన ఘటనను మెన్జెల్ ప్రస్తావించాడు.


ఆ సమయంలో దక్షిణాఫ్రికా ప్రేక్షకులు కాండిస్ వార్నర్‌ను ఎగతాళి చేస్తూ మాస్క్‌లతో ప్రదర్శన చేసిన విషయం అప్పట్లో తీవ్ర విమర్శలకు గురైంది. ఈ ఘటనను మెన్జెల్ తిరిగి గుర్తు చేస్తూ, అటువంటి ప్రవర్తన తప్పని ఖండించాడు. అయితే, ఎనిమిదేళ్ల క్రితం జరిగిన సంఘటనను మళ్లీ లేవనెత్తడంపై మెక్‌గిల్ తీవ్రంగా ఆగ్రహించాడు. “ఇలా మళ్లీ మళ్లీ చెప్పడం వల్ల బాధితులకు మళ్లీ గాయం చేసినట్లే” అంటూ మండిపడ్డాడు. కోపంలో మెన్జెల్‌ను “ఇడియట్”, “మోరాన్” అంటూ దూషించాడు.


అంతేకాదు, ఈ భాగాన్ని ఎడిట్ చేస్తే తాను ఇకపై ఈ షోలో పనిచేయనని మెక్‌గిల్ హెచ్చరించి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వివాదం ముదిరిపోవడంతో మెన్జెల్ హఠాత్తుగా కార్యక్రమాన్ని ముగించాల్సి వచ్చింది. ఆ ఎపిసోడ్ అసౌకర్య వాతావరణంలోనే ముగిసింది. ఈ ఘటనపై క్రికెట్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మెక్‌గిల్ వార్నర్ కుటుంబంపై తనకు ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఇలా స్పందించాడని సమర్థిస్తున్నారు. మరికొందరు మాత్రం పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌పై సహ హోస్ట్‌ను ఇలా దూషించడం సరికాదని విమర్శిస్తున్నారు.


అయితే, 2018లో ఆస్ట్రేలియా–దక్షిణాఫ్రికా టూర్ సమయంలో సౌతాఫ్రికా స్టేడియాల్లో కొందరు ప్రేక్షకులు డేవిడ్ వార్నర్ భార్య కాండిస్‌ను లక్ష్యంగా చేసుకుని అవమానకరంగా ప్రవర్తించారు. ఆమె గతంలో రగ్బీ స్టార్ సోనీ బిల్ విలియమ్స్‌తో ఉన్న పాత ఫోటోను ఆధారంగా చేసుకుని, అభిమానులు అతడి ముఖం మాస్కులు పెట్టుకుని స్టేడియంలో కూర్చొన్నారు. సఫారీ ఫ్యాన్స్ తీరుపై ఆసీస్ బోర్డు కూడా తీవ్రంగానే స్పందించింది. మీడియా, మాజీ క్రికెటర్లు కూడా ఈ ఘటనను అప్పట్లో తీవ్రంగా ఖండించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa