గత శుక్రవారం విడుదలైన ఆకాశం టీజర్ యూట్యూబులో దుమ్ము రేపుతోంది. తెలుగు, తమిళ భాషలలో కలుపుకుని మొత్తంగా ఆకాశం టీజర్ కు 2.5 మిలియన్ డిజిటల్ వ్యూస్ వచ్చాయి.
హీరో లైఫ్ లోని మూడు విభిన్న దశలు, అందులో ఉండే అందమైన ప్రేమ కథలు, హీరోయిన్లతో ప్రేమలో పడుతున్న క్రమంలో హీరో లైఫ్ లో ఎదురయ్యే విచిత్ర సంఘటనల సమాహారంగా ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తుంది.
ఈ సినిమాలో అశోక్ సెల్వన్ హీరోగా నటిస్తుండగా, ముగ్గురు హీరోయిన్లు రీతూ వర్మ, అపర్ణ బాలమురళి, శివాత్మిక రాజశేఖర్ నటిస్తున్నారు. వయోకాం 18 స్టూడియోస్ తో కలిసి శ్రీనిధి సాగర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తిక్ దర్శకత్వం చేస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందించగా, నవంబర్ లో థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది.
![]() |
![]() |