పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మరొక పాన్ ఇండియా మూవీ "సలార్". కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్, విలక్షణ నటుడు జగపతి బాబు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదుర్ నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన విడుదల కాబోతుంది. అంటే ఈ రోజుతో సరిగ్గా ఏడాది సమయముంది సలార్ థియేటర్లలో సందడి చెయ్యడానికి. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ పోస్టులు పెడుతున్నారు.