మలయాళంలో మోహన్ లాల్ లీడ్ రోల్ లో నటించిన దృశ్యం 1,2 సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. అదే పేరుతో ఈ సినిమాలు తెలుగులో కూడా రీమేక్ అయ్యి ఘనవిజయం సాధించాయి.
హిందీలో దృశ్యం 2 రిలీజ్ కావాల్సి ఉంది. నవంబర్ 18న ప్రేక్షకులను థ్రిల్ చెయ్యడానికి రెడీ అవుతుంది. ఈ సినిమాకు డైరెక్టర్ అభిషేక్ పాఠక్ కాగా, ఇందులో అజయ్ దేవగణ్, శ్రేయా శరణ్, టబు, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం రేపే ఈ మూవీ ఫస్ట్ లుక్ మరియు టీజర్ రిలీజ్ కాబోతున్నాయి. పనోరమా స్టూడియోస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, అభిషేక్ పాఠక్, కుమార్ మంగత్ పాఠక్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
![]() |
![]() |