అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ జంటగా నటించిన చిత్రం "ఊర్వశివో రాక్షసివో". రాకేష్ శశి డైరెక్షన్లో రొమాంటిక్ కామెడీ ఎంటెర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ రేపు సాయంత్రం 05:04 నిమిషాలకు విడుదల కాబోతుంది.
శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది.