వంశీ దర్శకత్వంలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్న రేణు దేశాయ్ పాత్రను పరిచయం చేయడానికి ఒక చిన్న వీడియో గ్లింప్సె ని విడుదల చేసారు. ఈ సినిమాలో రేణు దేశాయ్ హేమలత లవణం అనే పాత్రను పోషిస్తోంది. ఇది నిజ జీవిత పాత్ర మరియు హేమలత లవణం ఒక భారతీయ సామాజిక కార్యకర్త, రచయిత. ఈ వీడియోలో రేణు దేశాయ్ తెల్ల చీరలో మహిళా కార్యకర్తలతో కలిసి రోడ్డుపై నడుస్తూ పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమాలో బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ కృతి సనన్ సోదరి నుపుర్ సనాన్ అండ్ ప్రముఖ మోడల్ గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించనున్నారు. ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa