ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మళ్ళీ రావా వంటి ప్రేక్షకుల హృదయాలను దోచిన సినిమాలను తెరకెక్కించిన స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న మూడవ చిత్రం "మసూద".
ఈ సినిమాతో సాయి కిరణ్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. 'గంగోత్రి' ఫేమ్ కావ్యా కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటిస్తుండగా, తిరువీర్ రెడ్డి హీరోగా నటిస్తున్నారు.
ముందుగా ఈ సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించిన మేకర్స్ లేటెస్ట్ గా ఈ మూవీ విడుదల తేదీని నవంబర్ 11వ తేదికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.