డైలాగ్ కింగ్ సాయికుమార్ నట వారసుడు ఆది సాయికుమార్ బాక్సాఫీస్ పై సినిమాల యుద్దాన్ని చేస్తూనే ఉన్నాడు. మొన్ననే తీస్మార్ ఖాన్ అలా వచ్చి ఇలా వెళ్లిందో లేదో అప్పుడే మరో సినిమాను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసేసాడు.
ఆది నటిస్తున్న కొత్త చిత్రం "క్రేజీ ఫెలో". సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో ఫణికృష్ణ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.
లేటెస్ట్ గా ఈ మూవీ మేకర్స్ ట్రైలర్ రిలీజ్ డేట్ అండ్ టైం ఫిక్స్ చేస్తూ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. అక్టోబర్ ఒకటవ తేదీన సాయంత్రం 04:05 గంటలకు క్రేజీ ఫెలో ట్రైలర్ విడుదల కావడానికి రెడీ అవుతుంది. దిగాంగాన సూర్యవన్షి, మిర్ణా మీనన్ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ ఆర్ ధ్రువ సంగీతం అందిస్తున్నారు. పోతే, ఈ మూవీ అక్టోబర్ 14వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.