టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం "షాకిని డాకిని". సౌత్ కొరియన్ యాక్షన్-కామెడీ చిత్రం 'మిడ్ నైట్ రన్నర్స్'కి రీమేక్ గా ఈసినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా OTTకి వచ్చింది. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన 14 రోజుల్లోనే ఓటీటీలో రావడం విశేషం. నేటి నుండి,ఈసినిమా ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేయబడుతుంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఈసినిమా ప్రసారం కానుంది.