సూపర్ స్టార్ కృష్ణ గారి భార్య ఇందిరాదేవి గారు రెండ్రోజుల క్రితం పరమపదించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సూపర్ స్టార్ కృష్ణ గారిని, మహేష్ బాబును పరామర్శించి, ఇందిరాదేవి గారి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు.
గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండడంతో ఇందిరా దేవి గారి పార్థివ దేహాన్ని సందర్శించలేకపోయిన మెగాస్టార్ చిరంజీవి గారు ఆ తరవాతి రోజు ఉదయాన్నే సూపర్ స్టార్ కృష్ణ గారి ఇంటికి వెళ్లి, ఆయన్ను, మహేష్ మరియు కుటుంబ సభ్యులను పలకరించారు.
లేటెస్ట్ బజ్ ప్రకారం, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా మహేష్ ను పర్సనల్ గా కలిసి, ఇందిరా దేవిగారికి నివాళులు అర్పిస్తారని అంటున్నారు. మరి, నిన్న మొగల్తూరులో కృష్ణంరాజుగారి సంస్మరణ సభను ముగించుకుని హైదరాబాద్ వచ్చిన ప్రభాస్, మహేష్ ను పరామర్శించారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.