కింగ్ నాగార్జున నటించిన కొత్త చిత్రం "ఘోస్ట్". కొంచెంసేపటి క్రితమే ఈ మూవీ రిలీజ్ ట్రైలర్ ఈవెంట్ జరిగింది. ఇందులో నాగ్ మాట్లాడుతూ... తన పొలిటికల్ ఎంట్రీ పై నోరు విప్పారు.
రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో విజయవాడ నుండి నాగ్ పోటీ చెయ్యబోతున్నారని, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి నాగార్జున సన్నిహితులు కావడంతో, YSR కాంగ్రెస్ పార్టీ తరపున నాగ్ పోటీ చేస్తారని...ఇలా పలురకాల వార్తలపై స్పందిస్తూ... నాగ్ ఇలా మాట్లాడారు.. పదిహేనేళ్లుగా తన రాజకీయ రంగ ప్రవేశం పై ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయని, అలాంటి ఆధారంలేని వార్తలను విని వినీ అలవాటు పడిపోయినట్టు చెప్పారు.
దీనిని బట్టి అసలు నాగార్జున గారికి భవిష్యత్తులో కూడా రాజకీయాల్లోకి రావాలని ఉన్నట్టు అనిపించట్లేదని ప్రేక్షకులు అనుకుంటున్నారు.