పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన కొత్త చిత్రం "చోర్ బజార్". గెహన సిప్పి కధానాయిక. దళం,జార్జ్ రెడ్డి వంటి చిత్రాలతో విమర్శకుల మన్ననలను పొందిన జీవన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఐవి ప్రొడక్షన్స్ పతాకంపై బీఏ రాజు నిర్మించారు.
జూన్ నెలలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. ఈ నేపథ్యంలో కూడా మేకర్స్ రెండు నెలల టైం తీసుకుని సినిమాను ఇప్పుడు అంటే అక్టోబర్ 1వ తేదీ నుండి డిజిటల్ స్ట్రీమింగ్ చెయ్యబోతున్నారు. ఆహా ఓటిటిలో చోర్ బజార్ రేపటి నుండి స్ట్రీమింగ్ కాబోతుంది.