ప్రముఖ బిజినెస్ మ్యాన్, కర్ణాటక సీనియర్ పొలిటీషియన్ గాలి జనార్దన్ రెడ్డి తనయుడు, కిరీటి ఫిలిం ఇండస్ట్రీలోకి హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు-కన్నడలో రిలీజ్ కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను వెల్లడించారు. ఈ సినిమాకి 'జూనియర్' అనే టైటిల్‌ని లాక్ చేసినట్లు మూవీ మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం ఈ సినిమాని నిర్మిస్తుంది.
శ్రీ లీల ఈ సినిమాలో కిరీటి సరసన నటిస్తుంది. జెనీలియా ఒక ముఖ్య పాత్రలో కనిపించనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. కన్నడ లెజెండ్ క్రేజీ స్టార్ డాక్టర్ రవిచంద్ర వి కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. సాయి కొర్రపాటి నిర్మించనున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.