ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున 'ది ఘోస్ట్' సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా కనిపించనున్నారు. ది ఘోస్ట్ సినిమా అక్టోబర్ 5, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో ఏజెంట్ విక్రమ్ గా నాగార్జున కనిపించనున్నారు. ఈ చిత్రానికి భరత్-సౌరభ్ సంగీతం అందించారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా శాటిలైట్ రైట్స్ ని ప్రముఖ టెలివిజన్ ఛానల్ జెమినీ టీవీ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం. త్వరలోనే మూవీ మేకర్స్ నుంచి ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రానుంది. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్, శ్రీకాంత్ అయ్యంగార్ మరియు రవివర్మ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి మరియు నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ జి. గణేష్ సినిమాటోగ్రఫీ అందించారు.