ఫణి కృష్ణ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రంలో దిగంగనా సూర్యవంశీ, మర్నా మీనన్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. 'క్రేజీ ఫెలో' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ ఈ సినిమాకి లాక్ చేసారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ క్రేజీ ఫెలో సినిమా సెప్టెంబర్ 16న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది.
తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ను రేపు సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కే కే రాధా మోహన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ధృవన్ సంగీత అందిస్తున్నారు.