ప్రఖ్యాత బుల్లితెర వ్యాఖ్యాత అనసూయ భరద్వాజ్ పవర్ఫుల్ విలన్ రోల్ పోషించిన చిత్రం "దర్జా". ఇందులో సునీల్ కీలకపాత్రలో నటించారు. 'ఢీ' అక్సా ఖాన్, షఫీ, షకలక శంకర్, ఆమని తదితరులు నటించిన ఈ మూవీ జూలై నెలలో థియేటర్లలో విడుదలై, సరైన ప్రేక్షకాదరణకు నోచుకోలేకపోయింది.
లేటెస్ట్ గా, ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ ఐదవ తేదీ నుండి ఆహా ఓటిటిలో దర్జా మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది.
పొతే, ఈ సినిమాను సలీం మాలిక్ డైరెక్ట్ చెయ్యగా, రాప్ రాక్ షకీల్ సంగీతం అందించారు. శివ శంకర్ పైడిపాటి నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa