ఇండియన్ లెజెండరీ దర్శకుడు మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ గా తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ లో చియాన్ విక్రమ్ ,ఐశ్వర్యారాయ్ బచ్చన్ , కార్తీ, త్రిష, జయం రవి, శోభితా ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి, ప్రకాష్ రాజ్, ప్రభు, విక్రమ్ ప్రభు, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 30వ తేదీన అంటే నిన్ననే పాన్ ఇండియా భాషల్లో థియేటర్లలో విడుదలయ్యింది.
లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్త బ్యానర్ లపై నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని సుభాస్కరన్ సమర్పిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత AR రెహ్మాన్ సంగీతం అందించిన ఈ మూవీలో మాజీ విశ్వ సుందరి ఐశ్వర్యా రాయ్ విలన్గా నటించారు.
ఎవరికీ తెలియని విషయమేంటంటే, ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్ కి డబ్బింగ్ చెప్పింది సింగర్ సునీత గారు. గాయకురాలిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో భాగమైన సునీత గారు, ఐశ్వర్యా రాయ్ గారికి డబ్బింగ్ చెప్పడం ద్వారా ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో కూడా భాగమయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa