నాచురల్ స్టార్ నాని నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ దసరా ఫస్ట్ లిరికల్ వీడియో "ధూమ్ ధామ్ దోస్తానా" ఈ రోజు సాయంత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో 04:05 గంటలకు విడుదల కాబోతుంది. ఈ మేరకు మేకర్స్ కొంచెంసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేసారు.
నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ మూవీని శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తుండగా, సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 30వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.