పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మరొక మాగ్నమ్ ఓపస్ "ఆదిపురుష్". బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో రామాయణం ఆధారముగా తెరకెక్కుతున్న ఈ మైథలాజికల్ ఎపిక్ స్టోరీలో సీత అలియాస్ జానకిగా గ్లామర్ బ్యూటీ కృతిసనన్ నటిస్తుండగా, రావణాసురుడు / లంకేశ్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు.
నిన్న ఈ మూవీ టీజర్ భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఆదిపురుష్ టీజర్ కి ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. కొంతమంది నెటిజన్ల నుండి ఈ టీజర్ కు ట్రోల్స్ వస్తున్నా కానీ, మన తెలుగు వారి డార్లింగ్ సినిమా కావడంతో ఇక్కడ ఆదిపురుష్ టీజర్ కు చాలామంచి రివ్యూస్ వస్తున్నాయి. చాలామంది ఈ మూవీకి ఫ్యామిలీతో సహా వెళ్లాలని ఇప్పటినుండే ప్లాన్స్ కూడా వేసుకుంటున్నారట.
దీంతో యూట్యూబులో ఆదిపురుష్ టీజర్ కు వీక్షణల వెల్లువలు వచ్చి పడుతున్నాయి. యూట్యూబ్ ట్రెండింగ్ నెంబర్ వన్ పొజిషన్ లో ఈ టీజర్ దూసుకుపోతుంది.