మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవిగారి పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ "గాడ్ ఫాదర్" మరో రెండు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ సినిమా నుండి ఒక్కో ఎక్జయిటింగ్ అప్డేట్ ను ఇస్తూ వచ్చారు. లేటెస్ట్ గా గాడ్ ఫాదర్ టైటిల్ సాంగ్ ఈ రోజు సాయంత్రం 06:03 గంటలకు విడుదల కాబోతుందని అధికారికంగా తెలిపారు.
కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా, నయనతార, సత్యదేవ్, సునీల్ కీలకపాత్రలు పోషించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పెషల్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు.
సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు సంయుక్తంగా నిర్మించారు.