సింగర్, పొయెట్, రాజకీయ నాయకుడు MLA శ్రీ రసమయి బాలకిషన్ తాజాగా "రుద్రంగి" సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ ఐన రసమయి ఫిలిమ్స్ బ్యానర్ పై బాలకిషన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ టైటిల్ అండ్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. 'రుద్రంగి నాది',,,'రుద్రంగి బిలాంగ్స్ టు మీ' అని జగపతిబాబు తన పవర్ఫుల్ వాయిస్ తో చెప్పే డైలాగ్ గూజ్ బంప్స్ తెప్పిస్తుంది. జగపతి బాబు ఈ సినిమాలో భీం భీంరావు దొర పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమాను అజయ్ సామ్రాట్ డైరెక్ట్ చేస్తున్నారు. ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహన్ దాస్, కాలకేయ ప్రభాకర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.