పొన్నియిన్ సెల్వన్ ... క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ స్టార్ క్యాస్ట్ తో, భారీ బడ్జెట్ తో రెండు పార్టులుగా తెరకెక్కిన విషయం తెలిసిందే.
సెప్టెంబర్ 30వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదలైన ఈ మూవీ తమిళ బాక్సాఫీస్ వద్ద మ్యాజికల్ కలెక్షన్లను కొల్లగొడుతుంది. టాక్ గురించి పక్కన పెడితే, తెలుగులో కూడా ఈ సినిమాకు చాలా మంచి కలెక్షన్లు వస్తున్నాయి.
ఐతే, పొన్నియిన్ సెల్వన్ USA లో అరుదైన రికార్డును నమోదు చేసింది. నార్త్ అమెరికాలో ఈ సినిమా 4 మిలియన్ డాలర్ల మార్కును క్రాస్ చేసి అప్రతిహతంగా కొనసాగుతుంది. దీంతో ఈ రికార్డును నమోదు చేసిన తొలి తమిళ సినిమాగా, నాల్గవ సౌత్ మూవీగా పొన్నియిన్ సెల్వన్ చరిత్ర సృష్టించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa