యంగ్ హీరో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ "అన్ని మంచి శకునములే". బీవీ నందినిరెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.
కొంతకాలం నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా పై ఈ రోజు సాయంత్రం నాలుగింటికి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు.
మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను స్వప్న సినిమాస్, వైజయంతి మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వెన్నెల కిషోర్, రావు రమేష్, నరేష్, రాజేంద్ర ప్రసాద్, గౌతమి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.