టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్ పేపర్ బాయ్, మంచి రోజులు వచ్చాయి వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఇప్పుడు ఈ యంగ్ హీరో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్' అనే క్రేజీ టైటిల్‌ని లాక్ చేసారు. తాజగా ఇప్పుడు ఈ సినిమాను నవంబర్ 4, 2022న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమాలో సంతోష్ సరసన జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా రొమాన్స్ చేయనుంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు సమాచారం. వెంకట్ బోయనపల్లికి చెందిన నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రవీణ్ లక్కరాజు ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.