టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్ పేపర్ బాయ్, మంచి రోజులు వచ్చాయి వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తాజాగా తన తదుపరి ప్రాజెక్ట్ని ఓ బేబీ ఫేమ్ నందిని రెడ్డితో అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో సంతోష్ శోభన్‌కి లేడీ లవ్ గా మాళవిక నాయర్ నటించారు. ఈ సినిమాకి 'అన్నీ మంచి శకునములే' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ డిసెంబర్ 21, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది అని మూవీ మేకర్స్ ప్రకటించారు. వెన్నెల కిషోర్, రావు రమేష్, నరేష్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీత అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్వప్న సినిమా మరియు మిత్రవింద మూవీస్ బ్యానర్‌లపై నిర్మించారు.