త్రివిక్రమ్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మూడవ చిత్రం ప్రస్తుతం సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో అంతకుముందు వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తాజా బజ్ ప్రకారం, ఈ సినిమాలో మహేష్ బాబు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పాత్రలో నటిస్తున్నట్టు టాక్. ఈ నెల్లో స్టార్ట్ అవ్వబోయే కొత్త షెడ్యూల్ లో ఇందుకు సంబంధించిన సీన్స్ ను చిత్రీకరిస్తారట. మరి, చూడాలి ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.