తెలుగు రాష్ట్రాలలో సూపర్ హిట్ టాక్ తో మొదలైన మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ షోలు డీసెంట్ కలెక్షన్లను సాధిస్తున్నాయి. విడుదలకు ముందు ప్రేక్షకులు ఈ సినిమాపై ఏర్పరుచుకున్న అంచనాలను వంద శాతం అందుకుని, హౌస్ ఫుల్ కలెక్షన్లతో థియేటర్లలో రన్ అవుతుంది.
ముందుగా లిమిటెడ్ థియేటర్లలో విడుదలైన గాడ్ ఫాదర్ తాజాగా ఎక్స్ట్రా షోస్ మరియు థియేటర్లను కలుపుకుని మాస్ రాంపేజ్ చూపిస్తుంది. దీంతో మెగా అభిమానులు మరింత ఖుషి అవుతున్నారు.
కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రం మలయాళ హిట్ మూవీ 'లూసిఫర్' కి అఫీషియల్ తెలుగు రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక అతిథి పాత్రలో నటించారు.