కోలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఖుష్భూ హాస్పిటల్ బెడ్ పై తీసుకున్న సెల్ఫీ పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ ఫోటో షూటింగ్ కి సంబంధించింది కాదు... నిజంగా ఆమె హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఫోటోనే. coccyx బోన్ పెయిన్ తో కొన్నాళ్ల నుండి బాధపడుతున్న ఖుష్బూ తాజాగా ఆ పెయిన్ కి సర్జరీ చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా మారింది. ఈ మేరకు ఖుష్బూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
ఈ సంగతి తెలుసుకున్న అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ, సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
ఇటీవలే విడుదలైన శర్వానంద్ "ఆడవాళ్లు మీకు జోహార్లు" చిత్రంలో కీలకపాత్రలో నటించి, తెలుగు ప్రేక్షకులను పలకరించారు ఖుష్భూ.