2018లో విడుదలైన 'గీతగోవిందం' సినిమా ఎంతటి ప్రేక్షకాదరణకు నోచుకుందో, అంతకన్నా ఎక్కువగానే ఆడియన్స్ అటెన్షన్ ను గ్రాస్ప్ చేసారు విజయ్, రష్మికల జంట. ఆన్ స్క్రీన్ పై సూపర్బ్ కెమిస్ట్రీని షేర్ చేసుకున్న ఈ జంట ఆఫ్ స్క్రీన్ లోనూ అదే కెమిస్ట్రీని మెయిన్ టైన్ చేస్తున్నారని అంటే డేటింగ్ లో ఉన్నారని ఎప్పటినుండో హాట్ హాట్ వార్తలు వినిపిస్తున్నాయి.
వీరిద్దరి రిలేషన్ పై వార్తలు రావడం, వాళ్లేమో ఇవన్నీ ఒత్తి పుకార్లే అని కొట్టి పారేయడం, మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పడం... నార్మల్ అయిపోయింది. ఈ నేపథ్యంలో మరోసారి విజయ్, రష్మికలు హాట్ టాపిక్ గా మారారు. ఇద్దరు ఈ రోజు ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్ళబోతున్నట్టు భోగట్టా. మరి, దీనర్థమేంటో విజయ్, రష్మికలే సమాధానం చెప్పాలని కొంతమంది నెటిజన్లు కోరుకుంటున్నారు.