టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నందమూరి బాలకృష్ణతో ఒక సినిమాను చెయ్యబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ స్క్రిప్ట్ ను ఫైనలైజ్ చేసి, విశాఖపట్నం, సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నరసింహస్వామి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు కూడా చేయించారు అనిల్ రావిపూడి.
ఈ మూవీపై లేటెస్ట్ అప్డేట్స్ విషయానికొస్తే, నవంబర్ నెలాఖరి నుండి లేక డిసెంబర్ మొదట్లో గానీ ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుందంట. ప్రస్తుతానికి ఈ మూవీకి పని చెయ్యబోయే నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతుందట.
షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీ లీల ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తుంది.