బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ఇటీవలే "లాల్ సింగ్ చద్దా" సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. విడుదలకు ముందు ఈ సినిమా విపరీతమైన నెగిటివిటీని ఎదుర్కొంది. విడుదలైన తరవాత ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికిలబడింది.
అమెరికన్ కామెడీ డ్రామా "ఫారెస్ట్ గంప్" కి అఫీషియల్ ఇండియన్ రీమేక్ గా రూపొందిన లాల్ సింగ్ చద్దా ఘోర పరాజయం పొందినప్పటికీ ఆమిర్ ఖాన్ మాత్రం మరో రీమేక్ ను రూపొందించడంలో ఎలాంటి తత్తరపాటు పడట్లేదు. 2018లో విడుదలైన స్పానిష్ కామెడీ డ్రామా 'ఛాంపియన్స్' ను ఇండియన్స్ కు పరిచయం చేసేందుకు ఆమిర్ ఉవ్విళ్లూరుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులలో ఆమిర్ బిజీగా గడుపుతున్నారట.
పోతే, ఈ సినిమాను RC ప్రసన్న డైరెక్ట్ చేయనున్నారు. శంకర్ ఇషాన్ లోయ్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఔట్ ఆఫ్ కంట్రీ లో ఉన్న ఆమీర్ ఇండియాకు తిరిగిరాగానే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులను పరిశీలించి, సెట్స్ పైకి తీసుకెళ్తారట.