ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన 'దొంగలున్నారు జాగ్రత్త'

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 07, 2022, 08:18 PM

సతీష్ త్రిపుర దర్శకత్వంలో టాలెంటెడ్ అండ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి చిన్న కుమారుడు శ్రీ సింహ కోడూరి నటించిన "దొంగలున్నారు జాగ్రత్త" సినిమా సెప్టెంబర్ 23, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ చిత్రం ప్రేక్షకుల నుండి ఘనమైన స్పందనను పొందలేదు మరియు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ని రాబట్టడంలో విఫలమైంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం దొంగలున్నారు జాగ్రత్త సినిమా ఈ శుక్రవారం అంటే అక్టోబర్ 7, 2022 నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది.


సర్వైవల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ ఆధారంగా వచ్చిన ఈ మూవీలో ప్రీతి అస్రాని హీరోయిన్‌గా నటిస్తుంది. కాల భైరవ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. సముద్రఖని ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ అండ్ గురు ఫిల్మ్స్ నిర్మిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com