ఇరు తెలుగు రాష్ట్రాల థియేటర్లను దడలాడిస్తున్న సినిమా "గాడ్ ఫాదర్". ఆచార్య డిజాస్టర్ తదుపరి భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మెగాస్టార్ మాస్ రాంపేజ్ ను మరోసారి ప్రేక్షకులకు రుచి చూపించింది.
మోహన్ రాజా డైరెక్షన్లో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలకపాత్రను పోషించారు. తెలుగు ప్రేక్షకుల నుండి వస్తున్న విశేష ఆదరణను దృష్టిలో పెట్టుకుని గాడ్ ఫాదర్ మేకర్స్ ఈ రోజు సాయంత్రం ఆరింటికి బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.
నయనతార, సత్యదేవ్, సునీల్, షఫీ, సముద్రఖని ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా హిందీలో కూడా విడుదలై అమేజింగ్ రెస్పాన్స్ ను అందుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa