సుధీర్ వర్మ దర్శకత్వంలో బబ్లీ బ్యూటీ నివేదా థామస్ అండ్ సిజ్లింగ్ క్వీన్ రెజీనా కసాండ్రా నటించిన 'శాకిని డాకిని' సినిమా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులని ఆకట్టుకోవటంలో విఫలమైంది. కామెడీ థ్రిల్లర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిన రెండు వారాల తర్వాత OTTలో విడుదల చేశారు. తాజగా ఇప్పుడు ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ వారంలోని టాప్ 10 నెట్‌ఫ్లిక్స్ చిత్రాల లిస్ట్ లో ఈ చిత్రం రెండవ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, విప్లవ్ నిషాదమ్ ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి మైకీ ఎంసీ క్లియరీ సంగీతం అందించారు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్ మరియు క్రాస్ పిక్చర్స్ ఫిల్మ్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.