మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాకు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకాభిమానులు ఎలాంటి ఆదరణను కనబరుస్తున్నారో తెలిసిందే. తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదలైన ఈ సినిమా అక్కడి ప్రేక్షకులను సైతం మెప్పిస్తూ, మంచి కలెక్షన్లను నమోదు చేస్తుంది.
ఇక, ఓవర్సీస్ లో గాడ్ ఫాదర్ కు తిరుగేలేనట్టుగా సాగుతుంది. నాగార్జున ది ఘోస్ట్, బెల్లంకొండ గణేష్ స్వాతిముత్యం సినిమాల కలెక్షన్లు అంతంతమాత్రంగానే ఉన్నా, గాడ్ ఫాదర్ మూవీ మాత్రం ఈ వీకెండ్ కి 1 మిలియన్ డాలర్ల మార్కును చేరుకొని దూసుకుపోతుంది. లేటెస్ట్ గా ప్రపంచవ్యాప్తంగా గాడ్ ఫాదర్ 100కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరింది.
మోహన్ రాజా డైరెక్షన్లో మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి అఫీషియల్ రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక అతిధి పాత్రలో నటించారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ లపై RB చౌదరి, NV ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.